కేశినేని మరో సంచలన పోస్టు…. దేవినేని టార్గెట్

టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు ప్రాధాన్యం తగ్గించడంతో మొదలైన అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు.. కేశినేని నాని తన ఫేస్ బుక్ పోస్టులో వరుసగా అసంతృప్త పోస్టులు పెడుతూ టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకొస్తున్నాడు.

మొన్నటికి మొన్న చంద్రబాబు ఇచ్చిన పోస్టుల్లో తనను పక్కనపెట్టి జూనియర్లు అయిన రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లకు ఇవ్వడంపై అలిగిన నాని.. తనకు ఏ పోస్టూ వద్దంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి కలకలం రేపాడు.

ఇప్పుడు తన ఎదుగుదలకు అడ్డుగా ఉండి మొన్నటివరకు టీడీపీలో మంత్రిగా చక్రం తిప్పిన దేవినేని ఉమను తాజాగా టార్గెట్ చేశారు. ఈరోజు ఫేస్ బుక్ లో నాని పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడంటే అది టీడీపీ నేత దేవినేని ఉమ చలువే అని.. ఆయనకు నాని జీవితాంతం రుణపడి ఉండాలని సెటైర్ వేశారు. నానిని టార్గెట్ చేసి దేవినేని చేసిన కుట్రలే ఆయన విజయానికి కారణమయ్యాయని.. దేవినేని అవినాష్ ను గుడివాడకు పంపడం వెనుక దేవినేని ఉమ ప్రమేయం ఉండడంతో దాన్ని దృష్టిలో పెట్టుకునే కేశినేని నాని ఈ సెటైర్ వేసినట్టు అర్థమవుతోంది. నేరుగా అనకుండా ఇలా పరోక్షంగా దేవినేనిపై కేశినేని యుద్ధం చేస్తున్నాడు.

కేశినేని తీరు చూస్తుంటే త్వరలోనే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాడు. అయితే అసలే దారుణ ఓటమిలో ఉన్న బాబు ఇప్పటికిప్పుడు కేశినేని విషయంలో స్పందించే సాహసం చేయకపోవచ్చు.

కొడాలి.నాని తనని మంత్రిని చేసిన దేవినేని.ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!???

Posted by Kesineni Nani on Sunday, 9 June 2019