కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ అయిన వెంటనే ఆ సినిమా దర్శకుడికి తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. చాలామంది టాలీవుడ్ నిర్మాతలు అతడికి అడ్వాన్సులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒక దశలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చేశాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఎట్టకేలకు ప్రశాంత్ నీత్ తెలుగు సినిమాకు లైన్ క్లియర్ అయింది.

ఏకంగా ఎన్టీఆర్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు ఈ దర్శకుడు. అవును.. ఆర్-ఆర్-ఆర్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఆమధ్య మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించగా.. ఈరోజు దర్శకుడు కూడా కన్నడ మీడియాతో ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

లెక్కప్రకారం, ఆర్-ఆర్-ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్. కానీ మెగా కాంపౌండ్ లో ఇరుక్కుపోయాడు కొరటాల. చిరంజీవితో సినిమా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు, ఆ తర్వాత కూడా చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సో.. ఈ గ్యాప్ లో ప్రశాంత్ తో సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించాడు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

కుదిరితే మరోసారి అతడి దర్శకత్వంలో సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా జోడీ మరోసారి కలిసింది. ఓ బ్రహ్మాండమైన స్టోరీతో నిఖిల్ ను మెప్పించాడు దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజ హీరోగా డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే నిఖిల్ తో సినిమా ఉంటుంది.