మరోసారి తెరపైకి సూపర్ హిట్ జోడీ

హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. హీరో-దర్శకుడు కాంబోలో కూడా సూపర్ హిట్స్ ఉన్నాయి. ఫలానా హీరో, ఫలానా దర్శకుడితో సినిమా చేస్తే అది సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇప్పటికీ ఆ ఆనవాయితీ అలానే కొనసాగుతోంది. అందుకే తమకు ఓసారి హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి సినిమా చేయాలని, ప్రతి హీరో ఇష్టపడుతుంటాడు. నిఖిల్ కు కూడా ఆ కోరిక ఉంది.

వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమా చేశాడు నిఖిల్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల వద్ద డబ్బులు లేక, ఎటీఎంలు పనిచేయక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కూడా ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అలా నిఖిల్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది ఆ మూవీ. అందుకే ఆ దర్శకుడంటే నిఖిల్ కు చాలా అభిమానం.