జూన్ 13న…. ‘సాహో’ టీజర్

‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు రెండూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ సినిమా టీజర్ ను ఈ నెల 13న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

టీజర్ చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుందని చిత్రబృందం విశ్వసిస్తోంది. ఇక ఈ చిత్ర టీజర్ కోసం అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. జాకీ ష్రాఫ్, మందిరాబేడీ, నీల్ నితిన్ ముఖేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.