శర్వానంద్ హీరోగా…..  11 ఏళ్ళ తర్వాత రాజు సుందరం….

రాజు సుందరం టాప్ కొరియోగ్రాఫర్ల లో ఒకరు. ఆయన ఎంతో మంది హీరోల అరంగేట్రం చూశారు, ఎంతో మంది హీరోలు స్టార్లు గా మారడం చూశారు.

అయితే ఆసక్తికరమైన విషయాలు ఏంటి అంటే ఇతను ఇప్పుడు మళ్ళీ దర్శకత్వం చేయనున్నాడు. 2008 లో మొదటి సారి మెగా ఫోన్ పట్టిన రాజు సుందరం ఇప్పుడు మళ్ళీ దర్శకుడి గా మారే ప్రయత్నం చేస్తున్నారు. 11 సంవత్సరాలు తర్వాత తిరిగి దర్శకత్వం చేస్తున్న రాజు సుందరం సినిమా లో శర్వానంద్ హీరో గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే రాజు సుందరం శర్వానంద్ కి కథ వినిపించారట. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ త్వరలో మొదలు కానుంది.

అనిల్ సుంకర ఈ సినిమా ని ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ పతాకం పై నిర్మించనున్నాడు. ఈ సినిమా తో ఒక కొత్త పాయింట్ ని రాజు సుందరం ప్రేక్షకుల కి చెప్పనున్నాడని తెలుస్తుంది.

ఈ ఏడాది చివరి లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం శర్వానంద్ 96 తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే రణరంగం సినిమా విడుదల కోసం కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నాడు.