రాజశేఖర్ కూతురు, శ్రీహరి కొడుకు…. రెండో చిత్రం

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో కొత్త నటీ నటుల వెల్లువ ఎక్కువ అవుతుంది. ఒక వైపు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అరంగేట్రం చేస్తూ ఉండగా, మరో వైపు రాజశేఖర్-జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు కూడా అరంగేట్రం చేస్తున్నారు.

ఆల్రెడీ ఆనంద్ దేవరకొండ మరియు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కలిసి దొరసాని అనే సినిమా లో నటించగా ఇప్పుడు శివాత్మిక తన రెండో సినిమా ని ప్రకటించింది.

ఒక వైపు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని అరంగేట్రం పైన క్లారిటీ లేకపోగా, ఇప్పుడు శివాత్మిక మాత్రం వరుస సినిమాల తో దూసుకుపోతుంది.

అయితే శివాత్మిక తన రెండో సినిమా కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివాత్మిక తన రెండో సినిమాని శ్రీహరి కుమారుడు మేఘాంశ్ తో చేయనుంది.

మేఘాంశ్ ఇటీవలే రాజ్ దూత్ అనే సినిమా తో రాబోతున్నాడు. ఈ లోపే తను కూడా రెండో సినిమా ని ప్రకటించాడు. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా కి ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. సత్యనారాయణ ఈ సినిమా కి నిర్మాత గా వ్యవహరించనున్నాడు.