నటించాల్సి వస్తే….. శ్రీదేవి బయోపిక్ లో నటిస్తుందట..!

రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి గా ఎన్టీఆర్ బయోపిక్ లో మెరిసిన సంగతి తెలిసిందే. కానీ నిజానికి రకుల్ శ్రీదేవి పాత్ర లో అంతలా మెప్పించలేదు.

ఇకపోతే హిందీ సినిమా లో శ్రీదేవి బయోపిక్ గురించిన చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ రాలేదు.

ఇకపోతే ఇప్పుడు తాజాగా తమన్నా శ్రీదేవి లాగా మారాలి అని అనుకుంటుంది. శ్రీదేవి పాత్ర చేయాలనే కోరికను తమన్నా బయటపెట్టింది.

“నేను ఒక బయోపిక్ లో నటించాలి అనుకుంటున్నాను. అలాగే ఒక కంప్లీట్ డాన్స్ బేస్డ్ సినిమాలో కూడా నటించాలి అనుకుంటున్నాను. నేను శ్రీదేవి గారిని చూస్తూ పెరిగాను. ఆవిడని చూసి ఇన్స్ పేయిర్ అవుతూ ఈ దశ కి వచ్చాను. ఒకవేళ నేను ఏదైనా బయోపిక్ లో నటించాల్సి వస్తే అది కచ్చితంగా శ్రీదేవి బయోపిక్ అయి ఉండాలి.” అని ఆవిడ వెల్లడించింది.

ఒక వైపు ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమే కానీ ఎంత వరకు అవి వర్క్ అవుట్ అవుతాయి అనేది మాత్రం తెలియదు.