బిగ్ బాస్ హౌస్ లోకి తీన్మార్ సావిత్రి?

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులందరూ బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్లో నాని హోస్ట్ గా కనిపించారు. ఇక మూడవ సీజన్ లో హోస్ట్ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో నాగార్జున, అల్లు అర్జున్, చిరంజీవి వంటి చాలా మంది పేర్లు కూడా బయటకు వినిపించాయి.

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ విషయమై కూడా పుకార్లు వస్తున్నాయి. రేణుదేశాయ్, కే ఏ పాల్ వంటి పేర్లు కూడా వినిపించాయి.

ఈ సమయంలోనే తీన్మార్ సావిత్రి పేరు కూడా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ జాబితాలో ఉందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా వీ6 లో ప్రసారం అవుతున్న తీన్మార్ వార్తలతో సావిత్రి అలియాస్ జ్యోతి పాపులర్ అయ్యింది.

తెలంగాణ అమ్మాయిగా బిగ్ బాస్ 3 లో జ్యోతి వస్తుందని కొందరు అంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు ఈమెను ఆల్రెడీ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ విజయవంతంగా సాగుతున్న తీన్మార్ వార్తలను వదిలేసి జ్యోతి బిగ్ బాస్ లోకి వస్తుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.