Telugu Global
NEWS

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కమలం గాలం..!

తెలంగాణ రాజకీయాలలో గోడదూకుడు ఆట ఎక్కువైంది. సాయంత్రం వరకూ జాతీయ పార్టీ నాయకులుగా ఉన్నవారు అధికార ప్రాంతీయ పార్టీలో చేరిపోతున్నారు. తిరిగి ఉదయాన్నేఇంకొందరు నాయకులు మరో జాతీయ పార్టీ జెండా కప్పుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయాలలో ఇప్పుడు గోడ మీద పిల్లుల ప్రాభవం పెరిగిపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను, శాసన సభ్యులను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తనలో ఐక్యం చేసుకుంటోంది. ఇందుకు మేమేమి తక్కువ తినలేదంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ… కాంగ్రెస్, తెలుగుదేశం […]

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కమలం గాలం..!
X

తెలంగాణ రాజకీయాలలో గోడదూకుడు ఆట ఎక్కువైంది. సాయంత్రం వరకూ జాతీయ పార్టీ నాయకులుగా ఉన్నవారు అధికార ప్రాంతీయ పార్టీలో చేరిపోతున్నారు. తిరిగి ఉదయాన్నేఇంకొందరు నాయకులు మరో జాతీయ పార్టీ జెండా కప్పుకుంటున్నారు.

తెలంగాణలో రాజకీయాలలో ఇప్పుడు గోడ మీద పిల్లుల ప్రాభవం పెరిగిపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను, శాసన సభ్యులను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తనలో ఐక్యం చేసుకుంటోంది. ఇందుకు మేమేమి తక్కువ తినలేదంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ… కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులను ఆకర్షించే పనిలో పడింది.

ఇందుకు తాజా ఉదాహరణ నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికైన కమలనాథుడు ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డితో ఏకంతంగా సమావేశం కావడమే అంటున్నారు.

ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు ముందు డి.కె. అరుణ వంటి సీనియర్ నాయకులు కమల తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నిర్వీర్యం అవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను తమవైపునకు తిప్పుకునేందుకు కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షను జీవన్ రెడ్డితోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. గతంలో సమైక్య రాష్ట్రానికి పిసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డి. శ్రీనివాస్ కుమారుడు అరవింద్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను బిజేపీలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అంటున్నారు.

First Published:  10 Jun 2019 4:46 AM GMT
Next Story