Telugu Global
NEWS

ర‌వి ప్ర‌కాష్ అరెస్టు త‌ప్ప‌దా?

టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ అరెస్టు త‌ప్ప‌దా?…. ఆయ‌న జైలుకు వెళతారో? లేదా విచారణలంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతారో ఇవాళ తేల‌బోతుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఆయ‌న భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించ‌బోతున్నాయి. టీవీ 9 వాటాల వివాదంలో ర‌విప్ర‌కాష్ తప్పుడు పత్రాల్ని సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారని… రవిప్రకాశ్‌పై అలందా మీడియా డైరెక్ట‌ర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ప‌లు డాక్యుమెంట్లను తారుమారు చేశారని సైబ‌ర్‌క్రైమ్‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి. ఈమూడు కేసుల్లో ర‌విప్ర‌కాష్ విచార‌ణ‌కు […]

ర‌వి ప్ర‌కాష్ అరెస్టు త‌ప్ప‌దా?
X

టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ అరెస్టు త‌ప్ప‌దా?…. ఆయ‌న జైలుకు వెళతారో? లేదా విచారణలంటూ పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతారో ఇవాళ తేల‌బోతుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఆయ‌న భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించ‌బోతున్నాయి.

టీవీ 9 వాటాల వివాదంలో ర‌విప్ర‌కాష్ తప్పుడు పత్రాల్ని సృష్టించడంతోపాటు సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారని… రవిప్రకాశ్‌పై అలందా మీడియా డైరెక్ట‌ర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ప‌లు డాక్యుమెంట్లను తారుమారు చేశారని సైబ‌ర్‌క్రైమ్‌లో రెండు కేసులు న‌మోద‌య్యాయి.

ఈమూడు కేసుల్లో ర‌విప్ర‌కాష్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వారం రోజుల పాటు పోలీసులు విచారించారు. అయితే విచార‌ణ‌కు ఆయ‌న ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా ఆయన ఇచ్చిన సమాధానాలతో నివేదిక రూపొందించారు.

కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు తప్పని నిరూపించే ఆధారాలేవీ రవిప్రకాశ్‌ సమర్పించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఆయన దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. ఏవైనా అడిగితే తనకు గుర్తు లేదని చెబుతుండటంతో కావాలనే బుకాయిస్తున్నాడని వారు నమ్ముతున్నారు. అవే అంశాలతో రూపొందించిన నివేదికను సోమవారం న్యాయస్థానంలో సమర్పించాలని నిర్ణయించారు.

కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొంటామని సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ పరిణామాల్ని గమనిస్తే రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు కనిపిస్తోంది.

మ‌రోవైపు ర‌విప్ర‌కాష్ బెయిల్ కోసం చేసిన ప్ర‌య‌త్నాల్లో భాగంగానే విచార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మెరిట్ ఉంటేనే బెయిల్ ఇవ్వ‌మ‌ని ఆదేశించింది. విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోతే బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో కేసులో మెరిట్ కోస‌మే ర‌విప్ర‌కాష్ విచార‌ణ‌కు హాజ‌ర‌యిన‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు విచార‌ణకు హాజ‌రైన త‌ర్వాత రెండు రోజుల కింద‌ట హైద‌రాబాద్ సోమాజిగూడ‌లోని ప్రెస్‌క్ల‌బ్‌కు ర‌విప్ర‌కాష్ వెళ్లారు. అయితే ఆయ‌న్ని క‌నీసం అక్క‌డ ఒక్క జ‌ర్న‌లిస్టు కూడా ప‌లక‌రించ‌లేదు. క‌నీసం ద‌గ్గ‌ర‌కు కూడా రాలేదు.

దీంతో మ‌న‌స్తాపం చెందిన ర‌విప్ర‌కాష్ అక్క‌డి నుంచి ప‌ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. సీఈవోగా ఉన్న‌ప్పుడు క‌నీసం జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకోని ఆయ‌న్ని….ఇప్పుడు ఎవ‌రు పట్టించుకుంటార‌ని గుస‌గుస‌లాడుకోవ‌డం క‌నిపించింది.

First Published:  9 Jun 2019 8:53 PM GMT
Next Story