విరాట్ సేనకు కాషాయవర్ణం జెర్సీలు

  • ప్రపంచకప్ మూడుమ్యాచ్ ల్లో మారిన రంగు
  • ఇంగ్లండ్, అఫ్ఘన్, శ్రీలంక మ్యాచ్ ల్లో ఆరెంజ్ జెర్సీలు

ప్రపంచకప్ లో పాల్గొంటున్న విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా కు మెన్-ఇన్-బ్లూ అన్న ముద్దు పేరుంది. భారతజట్టు సాంప్రదాయ బ్లూకలర్ జెర్సీలు మాత్రమే ధరించి అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొంటూ వస్తోంది.

అయితే..ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రారంభమైన ప్రస్తుత ప్రపంచకప్ లోని మొత్తం తొమ్మిది లీగ్ మ్యాచ్ ల్లో…మూడుమ్యాచ్ ల్లో… కాషాయవర్ణం జెర్సీలు ధరించి పాల్గొనబోతోంది.

నాలుగుజట్లకే బ్లూ జెర్సీలు…

ప్రపంచకప్ లో తలపడుతున్న మొత్తం 10 జట్లలో…భారత్, అప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు మాత్రమే బ్లూ కలర్ జెర్సీలు ఉన్నాయి.

అయితే…ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్ జట్లతో జరిగే మ్యాచ్ ల్లో మాత్రం భారత్…తొలిసారిగా కాషాయవర్ణం జెర్సీలు ధరించి పాల్గోనుంది.

జూన్ 22న అఫ్ఘనిస్థాన్, జూన్ 30న ఇంగ్లండ్ జట్లతో జరిగే పోటీల్లో మెన్ ఇన్ బ్లూ కాస్త… మెన్ ఇన్ ఆరెంజ్ గా మారనున్నారు.
జులై 6న శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో మాత్రం టీమిండియా సాంప్రదాయ బ్లూకలర్ జెర్సీలు ధరించనుంది.

మొత్తం పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ తన తొలిరౌండ్ మ్యాచ్ లో జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే.