Telugu Global
NEWS

ఆగస్టు తర్వాత "దేశం"లో సమూల మార్పులు..!

తెలుగుదేశం పార్టీని వెంటాడే ఆగస్టు సెంటిమెంటు…. ఎన్నికలలో పరాజయం తర్వాత మరింత పెరిగింది. దీంతో ఈ రెండు నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, విమర్శలు గుప్పించడం కానీ చేయవద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాడు అమరావతి లో జరిగిన సీనియర్ నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు, కొందరు సీనియర్ నాయకులు సమావేశమై భవిష్యత్తులో ఎలా […]

ఆగస్టు తర్వాత దేశంలో సమూల మార్పులు..!
X

తెలుగుదేశం పార్టీని వెంటాడే ఆగస్టు సెంటిమెంటు…. ఎన్నికలలో పరాజయం తర్వాత మరింత పెరిగింది. దీంతో ఈ రెండు నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, విమర్శలు గుప్పించడం కానీ చేయవద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

సోమవారం నాడు అమరావతి లో జరిగిన సీనియర్ నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు, కొందరు సీనియర్ నాయకులు సమావేశమై భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సెంటిమెంట్ బలంగా ఉందని, ఆ నెల తర్వాత తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని మార్చడంతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులను కూడా మారుస్తారని తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పోలిట్ బ్యూరో సభ్యులను పూర్తిగా మార్చి యువరక్తంతో నింపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

60 సంవత్సరాలకు పైబడిన నాయకులను పార్టీ సలహాదారులుగా నియమించాలని, 45 సంవత్సరాల లోపు ఉన్న యువకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

జాతీయ అధ్యక్షుడిగా తాను ఉన్నప్పటికీ…. ఇతర రాష్ట్రాలలో పార్టీ బలంగా లేకపోవడంతో ఇక తన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ పైనే పెడతానని సీనియర్ నాయకులతో చంద్రబాబు నాయుడు అన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి దూరమైన బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకునేందుకు ఆ వర్గాలకు చెందిన వారికి పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీల్లో మరింత ప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కూడా దళిత వర్గానికి చెందిన నాయకుడికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

First Published:  10 Jun 2019 9:28 PM GMT
Next Story