Telugu Global
Cinema & Entertainment

లైన్ క్లియర్ చేసిన బాలయ్య

చాన్నాళ్ల కిందటే కొత్త సినిమాను ప్రకటించాడు బాలయ్య. కానీ అంతలోనే ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటివరకు అనుకున్న కథకు మార్పులు చేయాల్సి వచ్చింది. అదే విషయాన్ని చెప్పి దర్శకుడు కేఎస్ రవికుమార్ ను ఇంటికి పంపించాడు బాలయ్య. ఆ తర్వాత పలుమార్లు సిట్టింగ్స్ జరిగినప్పటికీ ప్రాజెక్టు మాత్రం సెట్ కాలేదు. ఎట్టకేలకు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నటసింహం. కేఎస్ రవికుమార్ చేసిన మార్పులు బాలయ్యకు నచ్చాయి. వెంటనే సెట్స్ పైకి వెళ్దామని […]

లైన్ క్లియర్ చేసిన బాలయ్య
X

చాన్నాళ్ల కిందటే కొత్త సినిమాను ప్రకటించాడు బాలయ్య. కానీ అంతలోనే ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో అప్పటివరకు అనుకున్న కథకు మార్పులు చేయాల్సి వచ్చింది. అదే విషయాన్ని చెప్పి దర్శకుడు కేఎస్ రవికుమార్ ను ఇంటికి పంపించాడు బాలయ్య. ఆ తర్వాత పలుమార్లు సిట్టింగ్స్ జరిగినప్పటికీ ప్రాజెక్టు మాత్రం సెట్ కాలేదు. ఎట్టకేలకు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నటసింహం.

కేఎస్ రవికుమార్ చేసిన మార్పులు బాలయ్యకు నచ్చాయి. వెంటనే సెట్స్ పైకి వెళ్దామని చెప్పేశాడు. అదే టైమ్ లో పక్కన నిర్మాత సి.కల్యాణ్ కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 రోజుల్లో బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది.

నిజానికి ఈమధ్య కాలంలో బాలయ్య ఇంత గ్యాప్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వాలిపోయేవారు. కానీ ఎన్నికల ప్రచారం, రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల కేఎస్ రవికుమార్ సినిమా ఆలస్యమైంది. మధ్యలో కథలో మార్పులు చేయాల్సి రావడం కూడా బాలయ్య కెరీర్ లో గ్యాప్ కు కారణం.

మరోవైపు బోయపాటి సినిమాపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నాడు బాలయ్య. బోయపాటి-బాలయ్య మధ్య చివరి దశ కథాచర్చలు ముగిశాయి. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అంటే బాలయ్య మళ్లీ సినిమాల విషయంలో జోరు పెంచాడన్నమాట.

First Published:  11 Jun 2019 10:00 AM GMT
Next Story