బిగ్ బాస్-3 లో…. వేణు, రేణు దేశాయ్?

ఇప్పటికే బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తయ్యాయి. ప్రేక్షకులందరూ బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా… రెండవ సీజన్ లో నాని కనిపించాడు. ఇక మూడవ సీజన్లో ఎవరు హోస్ట్ గా మారనున్నారు అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ వంటి చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి…. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాజా సమాచారం ప్రకారం నాగార్జున మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్స్ గురించి కూడా బోలెడు పేర్లు బయటకు వస్తున్నాయి. కే ఏ పాల్, బండ్ల గణేష్ పేర్లు వినిపించాయి కానీ కె.ఏ.పాల్ అమెరికా వెళ్లాడు, మరోవైపు బండ్ల గణేష్ మళ్లీ సినిమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే తాజాగా ఒక్కప్పుడు హీరో గా నటించిన వేణు తొట్టెంపూడి మరియు రేణుదేశాయ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లుగా మారనున్నారని ఇండస్ట్రీ వర్గాల లో వినికిడి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

బిగ్ బాస్ సీజన్ 3 జులై లో మొదలు కాబోతోంది. కాబట్టి మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 గురించిన వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.