2 వెరైటీ సినిమాలు ఒకేరోజు

సాధారణంగా వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు ఒకే రోజు విడుదలవుతుంటాయి. దీని వల్ల చిత్రాల మధ్య పోటీ ఉండదని భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జానర్ల సంగతి పక్కనపెడితే.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 2 సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి వస్తున్నాయి. అవే కల్కి, బ్రోచేవారెవరురా.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన సినిమా కల్కి. 80ల నాటి కథతో,, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే టీజర్ లో ఆ కొత్తదనాన్ని ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. ఈనెల 28న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. గరుడవేగ లాంటి సక్సెస్ తర్వాత రాజశేఖర్ నుంచి వస్తున్న సినిమా ఇది.

ఇదే తేదీన విడుదలకు ముస్తాబైంది మరో డిఫరెంట్ మూవీ బ్రోచేవారెవరురా. శ్రీవిష్ణు సినిమాలంటేనే డిఫరెంట్ గా ఉంటాయనే పేరుంది. బ్రోచేవారెవరురా మూవీ కూడా ఇందుకు ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ సినిమా టీజర్ కూడా బాగా క్లిక్ అయింది. సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

ఇలా డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కిన 2 సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏది సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.