వెంకీతో…. సాక్ష్యం దర్శకుడు?

ప్రస్తుతం దే దే ప్యార్ దే సినిమా ని తెలుగు లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే చాలా వార్తలు కూడా వచ్చాయి. హిందీ లో ఈ చిత్రం లో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ముఖ్య పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ ఈ సినిమా తో హిందీ లో విజయం సాధించింది.

ఇకపోతే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడానికి దర్శకుడిని వెతుకుతున్నారు నిర్మాతలు. వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, టబు పాత్ర ని టబునే తెలుగు లో కూడా చేస్తుండగా, రకుల్ ప్రీత్ పాత్ర లో ఎవరు చేస్తారా? అనే సప్సెన్స్ అందరిలోనూ ఉంది.

ఇకపోతే శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉంది అని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం శ్రీవాస్ చివరి చిత్రం. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో కాస్త బ్రేక్ తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు తిరిగి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా ని నిర్మించబోతోంది.