ఎన్జీకే ఫ్లాప్ పై…. రకుల్ ఇలా రియాక్ట్ అయింది !

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉండి ‘దేవ్’ అనే డబ్బింగ్ సినిమా తో కనిపించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది.

బాలీవుడ్ లో ఈమె నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా ఈ మధ్యనే విడుదలై హిట్ అయింది. అజయ్ దేవగన్, టబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది.

అయితే ఈ సినిమా హిట్ అయింది అన్న ఆనందం రకుల్ కి ఎక్కువ రోజులు మిగల్లేదు. ఆ వెంటనే విడుదలైన ‘ఎన్ జీ కే’ సినిమా డిజాస్టర్ గా మారింది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాక తమిళంలో కూడా డిజాస్టర్ గా మారింది.

ఈ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడుతూ…. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జర్నీలో భాగమేనని అజయ్ దేవగన్ వంటి పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ తన నటన అందరికి రిజిస్టర్ అయింది అంటే తన ఏడాది కష్టానికి మంచి ఫలితమే వచ్చిందని రకుల్ ప్రీత్ అంటోంది.

అంతేకాకుండా తన దృష్టిలో సక్సెస్ అంటే సంతోషంగా ఉండటమేనని ప్రస్తుతం తాను చేసే పని పట్ల చాలా ఆనందంగా ఉన్నాను అని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.