Telugu Global
CRIME

నగ్నంగా డాన్స్‌ చేయకపోతే చంపేస్తాం

అస్సాం రాష్టంలోని చేయగావ్‌ గ్రామంలో జరిగిన ఒక ఉత్సవం సందర్భంగా నిర్వాకులు డాన్స్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. వేరే ఊరి నుంచి 37,000 రూపాయలు ఇచ్చి రెండు డాన్స్‌ బృందాలను రప్పించారు. గిరిజన పద్దతిలో వాళ్ళ డాన్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం కాగానే… వాళ్ళను నగ్నంగా నృత్యం చేయాలని బలవంతం చేశారు నిర్వాహకులు. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన 700 గ్రామస్తులు కూడా ఆ డ్యాన్సర్లను నగ్నంగా నృత్యం చేయాలని బెదిరించారు. మీ నగ్న […]

నగ్నంగా డాన్స్‌ చేయకపోతే చంపేస్తాం
X

అస్సాం రాష్టంలోని చేయగావ్‌ గ్రామంలో జరిగిన ఒక ఉత్సవం సందర్భంగా నిర్వాకులు డాన్స్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. వేరే ఊరి నుంచి 37,000 రూపాయలు ఇచ్చి రెండు డాన్స్‌ బృందాలను రప్పించారు. గిరిజన పద్దతిలో వాళ్ళ డాన్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం కాగానే… వాళ్ళను నగ్నంగా నృత్యం చేయాలని బలవంతం చేశారు నిర్వాహకులు. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు.

ఈ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన 700 గ్రామస్తులు కూడా ఆ డ్యాన్సర్లను నగ్నంగా నృత్యం చేయాలని బెదిరించారు. మీ నగ్న ప్రదర్శన ఉంటుందని వాళ్ళు టిక్కెట్లు అమ్మితే కొనుక్కున్నాం… డబ్బు పెట్టి టిక్కెట్లు కొనుక్కున్నాక… ఇప్పుడు మీరు నగ్నంగా నృత్యం చేయకపోతే ఎలా? అని ఆ గ్రామస్తులు గొడవ గొడవ చేశారు.

మేము అలాంటి నృత్యాలకు ఒప్పుకోలేదని… మీరు ఎంత బలవంతం చేసినా మేము నగ్నంగా నృత్యం చేయమని తేల్చిచెప్పారు ఆ డాన్సర్లు. దాంతో నిర్వహకులు న్యూడ్‌ డ్యాస్‌ చేయకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. అందుకు బయపడ్డ ఆ గిరిజన యువతుల నృత్య బృందం అక్కడి నుంచి పారిపోయి ఒక వాహనంలో ఎక్కి తప్పించుకున్నారు.

కొంత దూరం వెళ్లాక పోలీసులకు, తెలిసిన వాళ్ళకు ఫోన్‌ చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం ఆ ప్రాంత ప్రజలకు తెలియడంతో ఈ ఘటనకు నిరసనగా వందలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్‌గా తీసుకుని నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.

First Published:  11 Jun 2019 12:30 AM GMT
Next Story