“ఏంటి సమంత నిజంగా తల్లి కాబోతుందా? మీకు ఈ విషయం తెలిస్తే నాకు కూడా చెప్పండి” – సమంత

చిన్న విషయాన్ని పెద్దది చేసి ఓవర్ చేయడం లో మన మీడియా ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే తాజాగా ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతున్న సమంత గర్భవతి అన్న వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు. ఈ విషయం పై సమంత తెలివిగా కౌంటర్ ఇచ్చింది.

సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న వార్తలపై క్లారిటీ తెచ్చుకోవాలనే భావన తో అభిమానులు సమంత ని టాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “ఏంటి సమంత తల్లి కాబోతుందా?” అనే టైటిల్ తో ఉన్న ఒక ఆర్టికల్ ని షేర్ చేసి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని సమంత ని అడిగారు.

సమంత ఈ విషయం తన దృష్టి కి రాగానే వెంటనే, ఈ విషయం పై స్పందిస్తూ రూమర్స్ ని ఖండించింది. “ఏంటి సమంత నిజంగా తల్లి కాబోతుందా? మీకు ఈ విషయం తెలిస్తే నాకు కూడా చెప్పండి” అని వెటకారం గా స్పందించింది.

ప్రస్తుతం సమంత ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సమంత తన ట్విట్టర్ హ్యాండిల్ పేరు బేబీ సమంత కింద మార్చుకుంది. ఈ సినిమా జులై 4 న విడుదల కానుంది.