సాదినేని యామిని…. ప్లేట్ ఫిరాయించింది….

మొన్నటి వరకు ఆమె టీడీపీలో ఫైర్ బ్రాండ్.. వైసీపీని, జగన్ ను టార్గెట్ చేసి చంద్రబాబు ప్రోద్బలంతో పరుష విమర్శలు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కథ అడ్డం తిరగడంతో సీన్ రివర్స్ అయ్యింది.

టీడీపీ ఓడిపోయింది. అయితే టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. అదే దూకుడుతో విమర్శలు చేస్తోంది.

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ తిరుపతి పర్యటన సందర్శంగా వైఎస్ జగన్ స్వాగతం పలకడం.. మోడీ కాళ్లకు నమస్కరించడానికి ప్రయత్నించడం తెలిసిందే.. దీన్ని బేస్ చేసుకొని ఫేస్ బుక్ లో సామినేని యామిని నోరుపారేసుకున్నారు. ‘మోడీ కాళ్లు పట్టుకునేందుకు లైన్లో నిలబడి వెంపర్లాడిన మా పులివెందుల పులి….వీడా’ అంటూ దారుణమైన పోస్టు పెట్టారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది.

దీనిపై వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడ్డారు. టీడీపీలో బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.

తాజాగా వైసీపీ మహిళా విభాగం సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో దీనిపై కేసు నమోదు చేశారు. దీంతో సీన్ రివర్స్ కాగానే యామిని రంగంలోకి దిగింది.

తాజాగా తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు తన పేరుతో పెడుతున్నారని యామిని అమరావతిలో ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

కేవలం రెండు ఫేస్ బుక్ ఖాతాలను మాత్రమే తాను నిర్వహిస్తానని…. జగన్ ను తిడుతూ పెట్టిన పోస్టు తనది కాదని పేర్కొంది. ఇలా యామిని నోరుపారేసుకున్న వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వైసీపీ టార్గెట్ చేయడంతో యామిని ఇలా ప్లేటు ఫిరాయించింది.