స్వామి స్వరూపానంద చెప్పింది అబద్దం….

ప్రస్తుతం ఏపీలో చాలా పేరున్న స్వామీజీ ఎవరంటే విశాఖ శారద పీఠం అధిపతి స్వామీ స్వరూపాంద అనే అంటారు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఆయన శిష్యులుగా ఉన్నారు. రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో కూడా ఆయనకు ఎంతో మంది పరిచయస్తులు ఉన్నారు. చాలా సార్లు వారందరూ విశాఖలోని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు.

ఇప్పుడు అలాంటి స్వామిపై సినీ గాయని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నా గురించి చెప్పింది అబద్దమంటూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఇంతకు ఆమె ఏం చెబుతున్నారంటే..

ప్రతీరోజు నాపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. కాని వాటన్నింటినీ నేను పెద్దగా పట్టించుకోను. కాని ఎంతో ప్రసిద్ది చెందిన స్వామి నా గురించి మీడియాలో ఇలా చెప్పడం బాధగా, ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.

ఇంతకు స్వరూపానంద ఏం చెప్పాంరంటే.. ఒక మీడియా ఇంటర్వూలో తన దగ్గరకు ఎంతో మంది సినీ ప్రముఖులు వస్తారని చిరంజీవి, రజనీకాంత్ కూడా నా పీఠానికి వచ్చారని…. సినీ గాయని సునీత కూడా తన దగ్గరకు వచ్చిందని చెప్పారు.

ఇప్పుడు సునీత ఆ క్లిప్పింగునే సోషల్ మీడియాలోపోస్టు చేసి వివరణ ఇచ్చరు. అంత పేరున్న స్వామి నా పేరును ఎందుకు మీడియాలో చెప్పారో అర్థం కావట్లేదు.. అందుకే ఇలాంటి రూమర్లు వచ్చినప్పుడు నా మనసు మరింత మొద్దుబారిపోతోందని వాపోయారు.

అయితే స్వామీజీ శిష్యులు మాత్రం…. స్వామీజీకి ఈ సినిమా గాయనీ, గాయకుల పేర్లు గుర్తుండక వేరొకరి పేరు చెప్పబోయి సునీత పేరు చెప్పి ఉంటారని… అంతేగానీ ఆమె స్వామిని దర్శించుకున్నారని చెప్పుకున్నంత మాత్రాన స్వామీజీకి కొత్తగా వచ్చే గౌరవం ఏమీ లేదని అన్నారు.