ఇప్పుడు కాదు….. ఫుల్ బిజీగా ఉన్నాను – తాప్సీ

తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను గత కొంత కాలంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యనే ‘బద్లా’ అనే సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్న ఈమె చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో కనిపించబోతోంది.

‘గేమ్ ఓవర్’ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో తాప్సీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14న విడుదల కాబోతోంది.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి స్పందించింది తాప్సీ. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అడగగా, ప్రస్తుతం తాను సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్టు తెలిపింది తాప్సీ.

“ఇప్పుడిప్పుడే నా జీవితం చాలా ఎగ్జైటింగ్ గా మారింది. పెళ్లి చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని నాకు ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం నా దృష్టి నా కెరీర్ పైన మాత్రమే ఉంది” అని క్లారిటీ ఇచ్చింది తాప్సీ. చూస్తూ ఉంటే తాప్సీకి పెళ్లి బాజాలు త్వరలో మోగేటట్టు కనిపించడం లేదు. ఇక తాప్సీ ‘తడ్కా’, ‘మిషన్ మంగళ్’ అనే హిందీ సినిమా లతో కూడా బిజీగా ఉంది.