రేపట్నుంచే ‘భీష్మ’

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీష్మ సినిమాకు డేట్ లాక్ అయింది. రేపట్నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుమల. ఛలో టైపులోనే ఇది కూడా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్. సినిమాకు భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ లోగోతో పాటు ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశారు. కానీ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే అంశంపై యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. ఎట్టకేలకు అన్ని పుకార్లకు చెక్ పెడుతూ, రేపట్నుంచి సెట్స్ పైకి రాబోతోంది భీష్మ.

ఈ సినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు నితిన్. కెరీర్ లో ఇప్పటికే గ్యాప్ రావడంతో, మిగిలిన ఈ 6 నెలల్లో 2 సినిమాల్ని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. నిజానికి అది అసాధ్యమైనప్పటికీ, కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ అయితే అదే చాలనుకుంటున్నారు అతడి ఫ్యాన్స్.

ఈ సంగతి పక్కనపెడితే, భీష్మతో కలుపుకొని ఇప్పటికే 3 సినిమాల్ని అధికారికంగా ప్రకటించాడు నితిన్. ఒకటి కంప్లీట్ అయిన వెంటనే ఇంకో సినిమాను స్టార్ట్ చేయాలి. అలా బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశాడు. సో.. భీష్మ సినిమాను వీలైనంత తక్కువ టైమ్ లో ఇతడు పూర్తిచేయాలి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుంది.