ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ గా సీతారామాంజనేయులు

ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు బుధవారం ఉదయం విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాంట్‌ కాంప్లెక్స్‌లో ఉన్న రవాణాశాఖ కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించారు.

1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి.

ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టాక ఖమ్మం, గుంటూరు, కర్నూలు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత డెప్యుటేషన్‌ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళి బీఎస్‌ఎఫ్‌లో ఐజీగా కొంత కాలం పనిచేసి ఇటీవలే తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.

వైఎస్ కుటుంబంతో ఆయనకున్న అనుబంధం దృష్ట్యా ఆయనను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని అందరూ భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా నియమించింది.