తెలంగాణలో బీజేపీ నయా ప్లాన్ ఇదే !

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు గెలిచారు. ఉత్త‌ర తెలంగాణ‌లో అంతో ఇంతో బ‌లం ఉంద‌ని నిరూపించుకున్నారు. కాలం క‌లిసివ‌స్తే తాము గెలిచిచూపుతామ‌ని క‌మ‌ల‌నాథులు ఇప్పుడు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పార్టీ జెండా తెలంగాణలో ఎగ‌ర‌వేయాల‌ని చూస్తున్నారు.

ఆదిలాబాద్‌లో సామాజిక స‌మీక‌ర‌ణాలు క‌లిసివ‌చ్చాయి. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌తో అండ‌ర్‌స్టాండింగ్‌, క‌రీంన‌గ‌ర్‌లో క్యాంపెయిన్‌, సికింద్రాబాద్ బీజేపీ ప‌క్కాసీటు అనే సెంటిమెంట్‌ను నిల‌బెట్టుకున్నారు. అయితే ఎంపీ ఎన్నిక‌ల్లో దాదాపు 18 శాతానికి పైగా ఓట్లు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ‌లో పాగా వేసేందుకు బీజేపీ న‌యా ప్లాన్ వేసింది.

ప‌ట్ట‌ణాల్లో బీజేపీకి ప‌ట్టు ఎక్కువ‌. కేడ‌ర్ కూడా ఇక్క‌డే ఉంది. దీంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోగా న‌గ‌రంలో బ‌ల‌ప‌డాల‌ని ప్లాన్ వేస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టి నుంచే ఆ పార్టీ నేత‌లు స్కెచ్‌గీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌స్ట్ హైద‌రాబాద్‌ను కొట్టి… ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించాల‌నేది ఆ పార్టీ ప్లాన్‌గా తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ దినప‌త్రిక‌ల్లో వ‌చ్చిన మిస్సింగ్ స్టోరీపై బీజేపీ నేత‌లు ర‌చ్చ ర‌చ్చ చేయ‌డం మొద‌లెట్టారు. నిర‌స‌న‌లు, కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా కౌంట‌ర్ అటాక్‌కి దిగింది. బీజేపీ నేత‌లు మైలేజీ కోసం డ్రామాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఇంట‌ర్ విష‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ దీక్ష‌ల‌కు దిగారు. ఇప్పుడు ఈ విష‌యంలో బీజేపీ నేత‌లు మాట‌ల‌కు ప‌దును పెట్టారు. వారికి మీడియా స‌పోర్టు కూడా దొరుకుతోంది. మొత్తానికి రాబోయే రోజుల్లో గ్రేట‌ర్‌లో బీజేపీ బలం పెరిగే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.