మళ్ళీ తేజ దర్శకత్వంలో కాజల్?

దర్శకుడు తేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం సీత. నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత మంచి పవర్ ఫుల్ కథ ని రెడీ చేసుకున్న తేజ కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా పెట్టి బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరో గా సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఈ సినిమా కి సంబధించిన ప్రమోషన్స్ భారీగా జరిగినా కానీ, అవేమీ సినిమాకి ఉపయోగపడలేదు. దర్శకుడు తేజ, హీరో-హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా ను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు కృషి చేసారు.

యూట్యూబ్ లో పాపులర్ అయిన ద విలేజ్ షో గంగవ్వ తో కూడా ఇంటర్వ్యూ ఇప్పించారు చిత్ర యూనిట్. ఇంత చేసినా కానీ సినిమా ఫ్లాప్ అవ్వడం తో కాజల్ చాలా డీలా పడిపోయింది. ఇప్పుడు కాజల్ కి ఎలాగైనా ఒక సక్సెస్ కావాలి.

ఈ నేపథ్యం లో తేజ కాజల్ తో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. తేజ ఈసారి కాజల్ కి హిట్ కచ్చితగా ఇస్తాను అనే మాట కూడా ఇచ్చాడట. పూర్తి స్థాయి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తో ఈ కాంబినేషన్ మళ్ళీ రానుంది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ఏ మేరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.