Telugu Global
NEWS

జగన్ తో జీవీఎల్.... బాబు అక్రమాలు తవ్వేందుకేనా.?

ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఏకాంతంగా భేటి అయిన బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు బయటకు వచ్చాక చెప్పిన ఓకే ఒక విషయం సంచలనంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటి మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన జీవిఎల్.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపై జగన్ తో మాట్లాడానని బాంబు పేల్చారు. దీనిబట్టి ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. చంద్రబాబు అవినీతి వ్యవహారాలను వైఎస్ జగన్ […]

జగన్ తో జీవీఎల్.... బాబు అక్రమాలు తవ్వేందుకేనా.?
X

ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఏకాంతంగా భేటి అయిన బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు బయటకు వచ్చాక చెప్పిన ఓకే ఒక విషయం సంచలనంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటి మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన జీవిఎల్.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపై జగన్ తో మాట్లాడానని బాంబు పేల్చారు.

దీనిబట్టి ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

చంద్రబాబు అవినీతి వ్యవహారాలను వైఎస్ జగన్ చేత బీజేపీ అధిష్టానం వెలికి తీయించబోతోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక జీవీఎల్ నోటి నుంచి జాలువారిన మరో మాట.. బీజేపీలోకి వచ్చే వారందరికీ స్వాగతం అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జనసేన నుంచి రావెల కిషోర్ బాబు వచ్చారని.. టీడీపీ సీనియర్ నాయకులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారని.. దీనిపై బీజేపీ పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత వారి చేరికలపై నిర్ణయం తీసుకుంటానని జీవీఎల్ చెప్పుకొచ్చాడు.

దీన్ని బట్టి రెండు టార్గెట్లుగా బీజేపీ ముందుకెళ్తోందని అర్థమవుతోంది. ఒకటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని అవినీతిని తవ్వితీసి చంద్రబాబును ఇరుకునపెట్టడం..రెండు టీడీపీలోని సీనియర్ నాయకులను లాగేసి ఆపార్టీని దెబ్బతీయడం.. ఇలా ఈ రెండు టార్గెట్లు ఏకకాలం పూర్తి చేసేసి 2024లో టీడీపీ ఉనికే లేకుండా చేయాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.

First Published:  12 Jun 2019 1:10 AM GMT
Next Story