ఇంతకీ అది టీజరా…. ట్రయిలరా?

ఒక సినిమాకు ఒకటి కంటే ఎక్కువ పీఆర్ టీమ్స్ ఉంటే ఇదే ఇబ్బంది. సాహో విషయంలో కూడా అదే జరుగుతోంది. పీఆర్ టీమ్స్ మధ్య సమన్వయం లోపించడంతో ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. రేపు ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కాబోతోంది. కాకపోతే అది టీజరా, ట్రయిలరా అనేది అందరి అనుమానం.

సాహో సినిమా టీజర్ రేపు రిలీజ్ కాబోతోందంటూ సోషల్ మీడియాలో గ్రాండ్ గా ప్రకటించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే, ఓ గంట గ్యాప్ లో మీడియా మొత్తానికి ప్రెస్ నోట్ వచ్చింది. సాహో ట్రయిలర్ రేపు రిలీజ్ అవుతోందనేది దీని సారాంశం. దీంతో వచ్చేది టీజరా.. ట్రయిలరా అనే గందరగోళం నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ కు కారణం, సాహో సినిమాకు 2 పీఆర్ టీమ్స్ వర్క్ చేయడమే.

అయితే రేపు వచ్చేది టీజర్ గానే పరిగణించాలంటోంది యూనిట్. సమాచార లోపం వల్ల అలా జరిగిందని, వచ్చేది టీజరే అని క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అంటే ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంత తొందరగా ట్రయిలర్ రిలీజ్ చేస్తే తర్వాత ఇక విడుదల చేయడానికి ఇంకేం ఉండవు. అందుకే వచ్చేది టీజర్ మాత్రమే. ఆగస్ట్ మొదటివారంలో ట్రయిలర్ ను లాంఛ్ చేస్తారు. అదన్నమాట సంగతి.