‘కబీర్ సింగ్’…. సందీప్ నెక్స్ట్ సినిమా ఏంటి?

‘అర్జున్ రెడ్డి’ వంటి మొదటి సినిమాతోనే సందీప్ వంగ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అంతేకాక ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తరువాత సందీప్ వంగ తో పని చేసేందుకు చాలా మంది స్టార్ హీరోలు సైతం ముందుకు వచ్చారు.

మరోవైపు సందీప్ వంగా మాత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిందీలో రీమేక్ చేయడంలో బిజీగా ఉన్నాడు. షాహిద్ కపూర్, కీయార అద్వానీ హీరో హీరోయిన్లుగా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’ త్వరలో  విడుదల కాబోతోంది.

ఈ సినిమా తర్వాత సందీప్ వంగ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే ‘కబీర్ సింగ్’ హిట్ అయితే బాలీవుడ్ లోనే కంటిన్యూ అవుతాడా? లేక తన తర్వాతి సినిమాని తెలుగులో తీస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఇంతకుముందు సందీప్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి తోనే మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

మరోవైపు సందీప్ వంగ ఒక మీడియం రేంజి హీరోతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సందీప్ వంగ తన తదుపరి సినిమా గురించి ఆగస్టులో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.