‘కల్కి’…. ఐటెం సాంగ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

హీరో రాజశేఖర్…. ‘పిఎస్వీ గరుడ వేగ’ సినిమా విజయంతో మళ్ళీ హీరోగా ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజశేఖర్ ‘కల్కి’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. తాజా సమాచారం ప్రకారం ‘పిఎస్వీ గరుడ వేగ’ సినిమాలో బాగా వర్కవుట్ అయిన సెంటిమెంట్ ను ఈ సినిమాలో కూడా వాడబోతున్నారని తెలుస్తోంది. అది మరేదో కాదు ఐటమ్ సాంగ్ సెంటిమెంట్.

‘పిఎస్వి గరుడ వేగ’ సినిమాలో డియో డియో ఐటెం సాంగ్ లో హాట్ బ్యూటీ సన్నీలియోన్ తన అందచందాలను ఆరబోస్తూ డ్యాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పాట ఎలా ఉన్నా సన్నీలియోన్ వల్ల ఈ వీడియో కి 70 మిలియన్ కి పైగా వ్యూ లు దక్కాయి.

అలాగే ‘కల్కి’ సినిమాలో కూడా ‘హార్న్ ఓకే ప్లీజ్’ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. ‘బాహుబలి’ వంటి సినిమాలలో మెరిసిన స్కార్లెట్ విల్సన్ రాజాశేఖర్ తో డాన్స్ చేయనుంది. ఈ ఐటెం సాంగ్ వల్ల సినిమాకి బజ్ పెరుగుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. మరి ఐటెం సాంగ్ సెంటిమెంట్ ‘కల్కి’ సినిమా కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.