Telugu Global
NEWS

నేషన్స్ లీగ్ సాకర్ విజేత పోర్చుగల్

ఫైనల్లో నెదర్లాండ్స్ పై విజయం యూరోసాకర్ చాంపియన్ పోర్చుగల్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకొంది. యూరోప్ దేశాల కోసం తొలిసారిగా నిర్వహించిన ప్రారంభ లీగ్ ఆఫ్ నేషన్స్ సాకర్ టైటిల్ ను…ఆతిథ్య పోర్చుగల్ సొంతం చేసుకొంది. పోర్టో వేదికగా జరిగిన టైటిల్ సమరంలో పోర్చుగల్ ఒకే ఒక్క గోలుతో నెదర్లాండ్స్ ను అధిగమించి ట్రోఫీ సొంతం చేసుకొంది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన టైటిల్ సమరంలో పోర్చుగల్ కెప్టెన్ కమ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను డచ్ డిఫెండర్లు […]

నేషన్స్ లీగ్ సాకర్ విజేత పోర్చుగల్
X
  • ఫైనల్లో నెదర్లాండ్స్ పై విజయం

యూరోసాకర్ చాంపియన్ పోర్చుగల్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకొంది. యూరోప్ దేశాల కోసం తొలిసారిగా నిర్వహించిన ప్రారంభ లీగ్ ఆఫ్ నేషన్స్ సాకర్ టైటిల్ ను…ఆతిథ్య పోర్చుగల్ సొంతం చేసుకొంది.

పోర్టో వేదికగా జరిగిన టైటిల్ సమరంలో పోర్చుగల్ ఒకే ఒక్క గోలుతో నెదర్లాండ్స్ ను అధిగమించి ట్రోఫీ సొంతం చేసుకొంది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన టైటిల్ సమరంలో పోర్చుగల్ కెప్టెన్ కమ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను డచ్ డిఫెండర్లు నీడలా వెంటాడి…గోలు చేసే అవకాశం లేకుండా అడ్డుకొన్నారు.

అయితే…ఆట 60వ నిముషంలో గాన్ కాడో గుడెస్ సాధించిన హెడర్ గోల్ తో పోర్చుగల్ విజేతగా నిలిచింది. గట్టిపోటీ ఎదురైనా తమజట్టు విజేతగా నిలవడం పట్ల కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రతిష్టాత్మక యూరోపియన్ సాకర్ టైటిల్ గెలుచుకొన్న తమ జట్టు …ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ ట్రోఫీ సైతం నెగ్గి..ఆధిక్యత నిరూపించుకొందని.. క్రిస్టియానో రొనాల్డో గుర్తు చేశాడు.

ఈ టోర్నీ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్ ను 3-1 గోల్స్ తో పోర్చుగల్, ఇంగ్లండ్ ను నెదర్లాండ్స్ 3-1 గోల్స్ తో ఓడించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

First Published:  11 Jun 2019 7:02 PM GMT
Next Story