భారత్,న్యూజిలాండ్ మ్యాచ్ కు వానగండం

  • మ్యాచ్ వేదిక నాటింగ్ హామ్ లో భారీవర్షాలు
  • వరుస విజయాలతో భారత్, న్యూజిలాండ్

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్,న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్ హామ్ వేదికగా జరగాల్సిన మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉంది.

రానున్న కొద్దిగంటల్లో సైతం వానజల్లులు, ఆకాశం మేఘావృతంకానుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనికితోడు గత రెండురోజులుగా నాటింగ్ హామ్ పరిసర ప్రాంతాలలో విడవకుండా వానలు పడటంతో నిర్వాహక సంఘానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో రన్నరప్ హోదాలో టైటిల్ వేటకు దిగిన న్యూజిలాండ్..ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడురౌండ్ల మ్యాచ్ లూ నెగ్గి.. ఆరుపాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

మరోవైపు…రెండుసార్లు విజేత భారత్ సైతం…ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాను, రెండోరౌండ్లో పవర్ ఫుల్ ఆస్ట్రేలియాను చిత్తు చేయడం ద్వారా.. వరుసగా మూడో విజయానికి గురిపెట్టింది.

గత రెండువారాలుగా జరుగుతున్న ప్రపంచకప్ మొదటి 16 మ్యాచ్ ల్లో…మూడుమ్యాచ్ లు..వానదెబ్బతో ఇప్పటికే రద్దులపద్దులో చేరిపోయాయి.

శ్రీలంక జట్టు ఆడాల్సిన రెండుమ్యాచ్ లకూ వానదెబ్బ తగిలింది. వెస్టిండీస్, పాకిస్థాన్,సౌతాఫ్రికా జట్లు సైతం వర్షం కారణంగా మ్యాచ్ ల రద్దుతో ఒక్కో పాయింటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.