Telugu Global
National

వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి?

కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అరుదైన గౌరవం దక్కనున్నదా ? ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే డిప్యూటీ స్పీకర్ పదవిని మోడీ ప్రభుత్వం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. లోక్ సభలో ప్రతిపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. అదే సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూ అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు […]

వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి?
X

కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అరుదైన గౌరవం దక్కనున్నదా ? ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే డిప్యూటీ స్పీకర్ పదవిని మోడీ ప్రభుత్వం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం.

లోక్ సభలో ప్రతిపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. అదే సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూ అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 22 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీతో సఖ్యంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తెలుగుదేశం పార్టీకి… ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి తమకు దూరమైతే ఎలా ఉంటుందన్న గుణపాఠం చెప్పాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం పొందవచ్చునన్నది వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచనగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో నేరుగా అధికారాన్ని పంచుకోవడం కంటే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ వంటి పదవిని పొందడం ఎంతో మేలు చేస్తుందన్నది పార్టీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.

ఈ నెల 17వ తేదీ నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. మోడీ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని ఆహ్వానం పలికితే మాత్రం మరో ఆలోచన లేకుండా అందుకు అంగీకరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు.

First Published:  11 Jun 2019 11:50 PM GMT
Next Story