“నన్ను మర్చిపోయారా”?!

షార్ట్ ఫిలిం లతో కెరీర్ ను ప్రారంభించి ‘టాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది ప్రియాంక జవాల్కర్. అనంతపూర్ లో పుట్టి పెరిగిన ఈ మరాఠి అమ్మాయి తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. ఈమె నటించిన ‘టాక్సీవాలా’ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా అవకాశాలు రావడంలేదు.

తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఫొటో వల్ల వార్తల్లోకి ఎక్కింది. “నన్ను మర్చిపోయారా?!” అంటూ క్యాప్షన్ పెట్టి ప్రియాంక జవాల్కర్ తన అందమైన ఫొటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటో చూస్తే ప్రియాంక అసలు టాప్ వేసుకోలేదేమో అన్నట్టు కనిపిస్తోంది.

ఆసక్తికరంగా ఒక ఇంగ్లీష్ డైలీ కూడా విజయ్ దేవరకొండ ‘టాక్సీ వాలా’ హీరోయిన్ టాప్ లేకుండా ఫొటోకి ఫోజు ఇచ్చింది అని వార్తలు రాయగా అది నిజమేనని అందరూ అనుకున్నారు.

కానీ నిజానికి ఆమె స్ట్రాప్ లెస్ టాప్ వేసుకుంది. క్లోజప్ షాట్ కావడం వలన టాప్ వేసుకోలేదేమో అన్నట్టు కనిపిస్తోంది అంతే.

‘టాక్సీ వాలా’ సినిమా తర్వాత కనుమరుగైపోయిన ప్రియాంక జవాల్కర్ కు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

View this post on Instagram

Have you forgotten me ?! ??

A post shared by Priyanka Jawalkar (@itsjawalkar) on