త్రిష నుండి మరొక థ్రిల్లర్

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో త్రిష కృష్ణన్ అగ్ర కథానాయిక గా చలామణి అవుతోంది. తమిళం లో గత సంవత్సరం విడుదల అయిన 96 అనే సినిమా తో సూపర్ హిట్ అందుకున్న ఈ నటి ప్రస్తుతం రాంగి అనే ఒక థ్రిల్లర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎం. శర్వానంద్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కి మురగదాస్ కథను అందించారు.

సాధారణం గా సినిమాలకు కేవలం దర్శకత్వం వహించడం లేదా నిర్మించడం చేసే మురగదాస్ ఒక కథ ను అందించాడంతో ఈ సినిమా అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా అది విడుదల అయిన వెంటనే అందరి చూపులను ఆకర్షించింది.

త్రిష ప్రధాన పాత్ర లో ఉన్న ఈ ఫస్ట్ లుక్ లో త్రిష చేతికి సంకెళ్ళ తో.. పక్కన పోలీస్ లను చూడచ్చు. ఒక ఇంటెన్సిటీ మరియు ఫెరోషియస్ గా ఉండే పాత్ర లో త్రిష ఈ సినిమా లో మేరవనున్నది అని తెలుస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ని దర్శకనిర్మాతలు తెలుగు లో కూడా విడుదల చేద్దామని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.