Telugu Global
NEWS

ర‌వి ప్ర‌కాష్‌పై మ‌రో కేసు పెడ‌తారా?

ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయి అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం…. అసత్యమైన, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. తమపై విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు […]

ర‌వి ప్ర‌కాష్‌పై మ‌రో కేసు పెడ‌తారా?
X

ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయి అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం…. అసత్యమైన, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.

తమపై విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్ తరపు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖండించాయి. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేశారంటూ విమర్శించాయి.

ప్రధానంగా టీవీ9 ప్రస్తుత ప్రమోటర్లు అయిన అలంద మీడియా, పాత ప్రమోటర్ అయిన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని రవిప్రకాశ్ చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవం అని ప్రకటించాయి. వాస్తవాలను అందరి ముందుకు తేవడానికి టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

“ఆగస్టు, 2018 నాటికి చింతలపాటి హోల్డింగ్స్‌, ఐల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ABCLలో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్‌ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది.

రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ABCLకు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లను నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లను పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో స్పష్టంగా నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం ఇచ్చాం.

ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు.
ఈ బదిలీ వ్యవహారం అంతా ఆగస్టు 2018లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్‌, షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. ఈ బదిలీ అంతా కూడా ఆయనకు తెలిసే జరిగింది. అయినప్పటికీ, 9 నెలల తర్వాత, రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్‌ విచారణను పక్కదారి పట్టించడానికి, ఇవంతా తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్నవనే అర్థమవుతోంది.

వాస్తవాలు ఇలా ఉంటే, రవిప్రకాశ్ మాత్రం ఈ డీల్‌లో అక్రమాలు జరిగినట్లుగా అవాస్తవమైన, అసహేతుకమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో ప్రభావితం కావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, పూర్తిగా అవాస్తమైన ఆరోపణలను రవిప్రకాశ్ చేసినందుకు న్యాయపరమైన చర్యలను మొదలుపెడుతున్నాం”…అంటూ టీవీ9 కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

First Published:  11 Jun 2019 8:51 PM GMT
Next Story