Telugu Global
Cinema & Entertainment

ఫారెన్ లో....  శ్రద్ధాకపూర్, ప్రభాస్

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ‘సాహో’ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని దర్శకుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఒక ఐటెం సాంగ్ ను రామోజీ ఫిలిం సిటీ లోని ఒక పబ్ […]

ఫారెన్ లో....  శ్రద్ధాకపూర్, ప్రభాస్
X

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ‘సాహో’ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని దర్శకుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఒక ఐటెం సాంగ్ ను రామోజీ ఫిలిం సిటీ లోని ఒక పబ్ సెట్ లో షూట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ‘సాహో’ చిత్ర బృందం త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనుందట. అక్కడ ప్రభాస్, శ్రద్దల మధ్య ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

రొటీన్ సినిమాలలా కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధకపూర్ కు కూడా కీలక పాత్ర ఉంటుందని, ఆమె పోలీస్ పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఈ నెల 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.

First Published:  12 Jun 2019 2:09 AM GMT
Next Story