బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్న… సునీల్

స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సునీల్ హీరోగా మాత్రం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. వరుస పరాజయాలను చవిచూసిన సునీల్ ఇక హీరోగా కాకుండా మళ్లీ కామెడీ పాత్రల వైపు మొగ్గు చూపాడు.

తాజాగా ‘అరవింద సమేత’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘చిత్రాలహరి’ వంటి సినిమాలలో మళ్ళీ కమెడియన్ పాత్రను పోషించిన సునీల్ మళ్లీ తిరిగి హీరోగా మారబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఒక హిందీ సినిమా రీమేక్ లో సునీల్ నటించబోతున్నాడు. అది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ సినిమా.

ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ సినిమా హిందీ లో బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ సినిమాలో హీరో ఒక గుడ్డివాడు. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేయబోతున్నాడట. ఇప్పటికే సునీల్ కి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు నిర్మాతలు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అన్నీ కుదిరితే ఈ సినిమా రీమేక్ కోసం సునీల్ గుడ్డివాడి పాత్రలో కనిపిస్తాడు అన్నమాట. మరోవైపు సునీల్ బన్నీ-త్రివిక్రమ్ సినిమా మరియు రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో కూడా కామెడీ పాత్రలు పోషిస్తున్నాడు.