ప్రతి భాషలో నన్ను గుర్తుపడతారు

సౌత్, నార్త్ లో తనను ఎవరైనా గుర్తుపడతారంటోంది హీరోయిన్ తాప్సి. అదృష్టంకొద్దీ తనకు మంచి కథలు వస్తున్నాయని, అన్ని భాషల్లో నటించే అవకాశం వస్తోందని హ్యాపీగా చెబుతోంది. కాకపోతే వరుసగా సినిమాలు చేయకుండా గ్యాప్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

“కథల ఎంపికలో ఎలాంటి ఇబ్బంది లేదు. అదృష్టం కొద్ది అన్నీ మంచి కథలే వస్తున్నాయి. అందులో నుండి మూడు నాలుగు కథలు పిక్ చేసుకొని ఈజీగా మూడు నాలుగు సినిమాలు చేయగలను అనే నమ్మకం వచ్చింది. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ కాకుండా చిన్న గ్యాప్ తో సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకోవాలనుకుంటున్నా.”

ఆమె నటించిన గేమ్ ఓవర్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది. తనకు నంబర్ గేమ్ తో పనిలేదంటోంది.

“నిజానికి కమర్షియల్ సినిమాలో గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తే నేను రేస్ లో మూడో స్థానంలోనో లేదా నాలుగో స్థానంలోనో ఉండేదాన్ని. డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటున్నందుకు ఇప్పుడు నా రేస్ లో నేనే మొదటి స్థానంలో పరిగెడుతున్నాను. నేను తీసుకున్న డిసిషన్ నన్ను నటిగా మరింత స్థానంలో నిలబెట్టింది.”

ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాప్సి, తెలుగులో కూడా ఓ ఆఫర్ రెడీగా ఉందని ప్రకటించింది. మరోవైపు హిందీలో 2 సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది.