థియేటర్ ని కొనుగోలు చేసిన త్రివిక్రమ్

ఇప్పటికే టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులైన వి.వి.వినాయక్, తేజ లు చాలా రోజుల క్రితమే థియేటర్లను కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇప్పటికే త్రివిక్రమ్ కు హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో చాలా ప్రాపర్టీ లు ఉన్నాయి. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఒక థియేటర్ ను కూడా కొనుగోలు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లా రాజనగరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయుడు అనే థియేటర్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ థియేటర్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐదు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, థియేటర్ ను ప్రస్తుతం రెనోవేట్ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు మరియు సుశాంత్ లు ముఖ్య పాత్రలను పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.