Telugu Global
NEWS

అమరావతిలో శిల్పారామం...!

శిల్పారామం. తెలంగాణ రాజధాని హైదరాబాదులో మంచి పర్యాటక ప్రాంతం. నగరంలో నివసిస్తున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రాంతం శిల్పారామం. ప్రతి ఏటా హైదరాబాద్ వచ్చిన లక్షలాది మంది పర్యాటకులు చార్మినార్ తో పాటు శిల్పారామాన్ని కూడా సందర్శించకుండా వెళ్లరు. ఇప్పుడు ఇలాంటి శిల్పారామాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసేందుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో […]

అమరావతిలో శిల్పారామం...!
X

శిల్పారామం. తెలంగాణ రాజధాని హైదరాబాదులో మంచి పర్యాటక ప్రాంతం. నగరంలో నివసిస్తున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రాంతం శిల్పారామం. ప్రతి ఏటా హైదరాబాద్ వచ్చిన లక్షలాది మంది పర్యాటకులు చార్మినార్ తో పాటు శిల్పారామాన్ని కూడా సందర్శించకుండా వెళ్లరు.

ఇప్పుడు ఇలాంటి శిల్పారామాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసేందుకు నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో శిల్పారామం ఏర్పాటు చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

హైదరాబాద్ లో ఉన్న శిల్పారామం నమూనాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రాంతాల విశేషాలను కూడా ఈ శిల్పారామంలో పొందుపరచనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకంగా ఎంతో భవిష్యత్తు ఉందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పర్యాటక రంగంలో అభివృద్ధి కుంటుపడిందని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. రాజధాని అమరావతితో సహా విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, మిగిలిన జిల్లాల్లో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతాలలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

ఇతర రాష్ట్రాలకు పోటీగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు మళ్లీ మళ్లీ సందర్శించేలా పలు కొత్త ప్రాజెక్టులను రూపొందిస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనలో శిల్పారామంతో సహా ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

First Published:  12 Jun 2019 11:20 PM GMT
Next Story