Telugu Global
NEWS

మొదటి ప్రసంగంలోనే చంద్రబాబుతో ఆడుకున్న అంబటి

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అభినందిస్తూ ఇవాళ పలువురు ఎమ్మెల్యేలు శాసన సభలో ప్రసంగించారు. ఇదే క్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ప్రసంగించారు. మిగతా సభ్యులకు భిన్నంగా కేవలం చంద్రబాబు లక్ష్యంగా ఈ ప్రసంగం సాగడం గమనార్హం. కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ చంద్రబాబుకు చురకలు అంటించారు అంబటి. ఇంతకూ తన ప్రసంగంలో ఏం చెప్పారంటే…. ”అధ్యక్షా.. మీతో ఎంతో కాలంగా నాకు పరిచయం ఉంది.. మీరు చాలా అనుభవజ్ఞులు.. ఎవరినైనా […]

మొదటి ప్రసంగంలోనే చంద్రబాబుతో ఆడుకున్న అంబటి
X

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అభినందిస్తూ ఇవాళ పలువురు ఎమ్మెల్యేలు శాసన సభలో ప్రసంగించారు. ఇదే క్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ప్రసంగించారు. మిగతా సభ్యులకు భిన్నంగా కేవలం చంద్రబాబు లక్ష్యంగా ఈ ప్రసంగం సాగడం గమనార్హం. కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ చంద్రబాబుకు చురకలు అంటించారు అంబటి. ఇంతకూ తన ప్రసంగంలో ఏం చెప్పారంటే….

”అధ్యక్షా.. మీతో ఎంతో కాలంగా నాకు పరిచయం ఉంది.. మీరు చాలా అనుభవజ్ఞులు.. ఎవరినైనా పోల్చాలంటే గతంలో అదే పదవిలో ఉన్నవారితో పోల్చుతారు.. గతంలో సభాపతిగా వ్యవహరించిన వ్యక్తి ఒక రిమోట్ కంట్రోల్ సాయంతో పని చేశారు.

అప్పటి సభానాయకుడి చేతిలో రిమోట్ ఉంటే.. ఆయన ఎలా చెబితే సభాపతి అలా చేశారు. కాని అధ్యక్షా.. మీరు అలా కాదు. ఇప్పటికే మా సభా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కొత్త సాంప్రదాయాన్ని తీసుకొని వస్తానని.. ఆయన చేతిలో రిమోట్ లేదు.. మీరు స్వేఛ్ఛాయుతంగా పని చేసి ఒక మంచి స్పీకర్ అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు

అంతే కాదు అధ్యక్షా.. సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. గత శాసనసభలో నేను లేను కాని.. నేను టీవీల్లో చూసిందాన్ని బట్టి.. అప్పటి స్పీకర్‌ను ఆనాటి సభా నాయకుడు చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఇద్దరూ కలసి తోడ్కొని వచ్చారు అధ్యక్షా.. కాని నలబై ఏండ్ల సీనియార్టీ కలిగిన ఆ నాయకునికి ఈ సాంప్రదాయం పాటించాలని తెలియక పోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది అని అంబటి అన్నారు.

కాని మాకు ఒక సాంప్రదాయం ఉంది.. మా నాయకుడు వైఎస్ జగన్ ముందే చెప్పారు.. ఎవరైనా మా పార్టీలోకి వస్తే వారిని రాజీనామా చేసిన తర్వాతే రమ్మని చెప్పారు అధ్యక్షా.. కాని చంద్రబాబు అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వాడమని చెప్పండి.. అంటూ పూర్తిగా చంద్రబాబు టార్గెట్‌గా మాట్లాడారు.

First Published:  13 Jun 2019 3:08 AM GMT
Next Story