దాసరి కుమారుడు కనబడడం లేదు….

తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రముఖ సినీదర్శకుడు, కేంద్రమాజీ మంత్రి దివంగత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. ఆయన అదృశ్యం అయిన విషయం గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయమై ఆరా తీయగా అది నిజమే అని, ప్రభు కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో… పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఈ నెల 9 వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్ళిన ప్రభు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. అయితే ప్రభు ఇలా మాయం అవ్వడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఒకసారి ఆయన ఇలాగే మాయం అయ్యి, కొద్ది రోజులకి బయటకు వచ్చి భార్య సుశీలే తనను కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించారు.

అయితే ప్రస్తుతం వీరి కుటుంబం లో ఆస్తి పంపకాల గురించి వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభు అదృశ్యం అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు.