భారత విలువిద్య జట్టుకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్

  • ప్రపంచ విలువిద్య క్వార్టర్ ఫైనల్లో భారత్ 
  • 2012 ఒలింపిక్స్ తర్వాత తొలిసారి అర్హత

భారత ఆర్చరీజట్టు…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న 2019 ప్రపంచ విలువిద్య పోటీల.. పురుషుల రికర్వ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా భారతజట్టు..ఒలింపిక్స్ టికెట్ ఖాయం చేసుకొంది.

తరుణ్ దీప్ రాయ్, అటానూ దాస్, ప్రవీణ్ దాస్ లతో కూడిన భారత జట్టు…ప్రీ-క్వార్టర్ ఫైనల్లో కెనడాజట్టును 5-3తో అధిగమించి…క్వార్టర్ ఫైనల్స్  చేరడం ద్వారా ఒలింపిక్స్ లో చోటు సంపాదించింది.

2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత…పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో ఒలింపిక్స్ కోటా సాధించడం భారతజట్టుకు ఇదే మొదటిసారి.