ఎమ్మెల్యే గా ఓడిపోయింది…. బిగ్ బాస్ హౌస్ లోకి మాధవీ లతా?

కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన హీరోయిన్ మాధవీ లతా ఇప్పుడు తన కెరీర్ మీద ఫోకస్ పెడుతుంది.

ఎలాగో చేతిలో సినిమాలు లేవు కదా అని రాజకీయాల్లో తన లక్ పరీక్షించుకుందామని అనుకుంది…. కానీ ప్రజలు ఆమెని తిరస్కరించడం తో…. తిరిగి మళ్ళీ సినిమాలపైనే దృష్టి పెట్టినట్లుగా కనపడుతోంది. ఉన్న పాటు గా తిరిగి క్రేజ్ సంపాదించుకోవాలంటే ఇప్పుడు తన ముందు ఉన్న ఏకైక ఆప్షన్ బిగ్ బాస్ హౌస్ లో కి ఎంటర్ కావడం.

బిగ్ బాస్ నిర్వాహకులు మాధవి లత ని అప్రోచ్ అయినట్లు సమాచారం. మాధవి కూడా కొంచెం ఎక్కువే పారితోషికం డిమాండ్ చేసిందట. శ్రీ రెడ్డి యాక్టివ్ గా కాస్టింగ్ కౌచ్ గురించిన ఆరోపణలు చేస్తున్న సమయం లో… కొంత లో కొంత మాధవి కూడా యాక్టివ్ గా తిరిగింది. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఈమెకి బిగ్ బాస్ తో మంచి ఎంట్రీ దొరికినట్లు అవుతుందని అంటున్నారు.