ప్రేమలో పడటం రాదు అంటున్న…. ‘మన్మథుడు 2’

ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు నాగార్జున హీరోగా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మొదట 40 ఏళ్లు దాటిన వ్యక్తిలా కనిపించినప్పటికీ నాగార్జున తన పాత్రలో ప్లే బాయ్ షేడ్స్ కూడా ఉన్నాయని హింట్ ఇచ్చాడు. తనకు ప్రేమలో పడటం రాదు అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ సినిమాలో దేవదర్శిని, లక్ష్మీ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ లో కూడా వీరు కనిపించి ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు కామెడీ కూడా దట్టంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.

‘మన్మధుడు’ సినిమా లాగానే ఈ సినిమా కూడా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత గెస్ట్ రోల్ పోషిస్తోంది.