Telugu Global
CRIME

పెళ్లి పేరుతో మోసాలు.... కిలాడీ లేడీ అరెస్ట్ !

పెళ్లి పేరుతో మోసాలు ఇటీవ‌ల పెరిగాయి. ఇందుకు ఆన్‌లైన్ సైట్లు వేదిక అవుతున్నాయి. మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొపైల్స్ పెట్ట‌డం….ఆక‌ర్షించే బ‌యోడేటాను ఉంచ‌డం.. ఆత‌ర్వాత ఎవ‌రైనా లైన్‌లోకి వ‌స్తే వారిని పెళ్లి పేరుతో మోసం చేయ‌డం కామ‌న్‌గా మారింది. పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీని ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఒక‌సారి ఇదే త‌ర‌హా మోసంతో చంచ‌ల్‌గూడ జైలులో చిప్ప‌కూడు తిన్న ఆమె మార‌క‌పోవ‌డం ఇందులో ట్విస్ట్‌. నెల్లూరుకు చెందిన అర్చన (32) […]

పెళ్లి పేరుతో మోసాలు.... కిలాడీ లేడీ అరెస్ట్ !
X

పెళ్లి పేరుతో మోసాలు ఇటీవ‌ల పెరిగాయి. ఇందుకు ఆన్‌లైన్ సైట్లు వేదిక అవుతున్నాయి. మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొపైల్స్ పెట్ట‌డం….ఆక‌ర్షించే బ‌యోడేటాను ఉంచ‌డం.. ఆత‌ర్వాత ఎవ‌రైనా లైన్‌లోకి వ‌స్తే వారిని పెళ్లి పేరుతో మోసం చేయ‌డం కామ‌న్‌గా మారింది.

పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఓ కిలాడీ లేడీని ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఒక‌సారి ఇదే త‌ర‌హా మోసంతో చంచ‌ల్‌గూడ జైలులో చిప్ప‌కూడు తిన్న ఆమె మార‌క‌పోవ‌డం ఇందులో ట్విస్ట్‌.

నెల్లూరుకు చెందిన అర్చన (32) తిరుపతిలో ఎంబీఏ చ‌దివింది. ఇంత‌కుముందే పెళ్లి అయింది. కానీ భ‌ర్త‌తో దూరంగా ఉంటున్న ఆమె హైద‌రాబాద్‌లో ఉమెన్స్ హాస్ట‌ల్‌లో ఉంటుంది. జల్సాలకు అలవాటుపడింది. యువ‌కుల‌ను మోసం చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది.

మాట్రిమోనీలో న‌కిలీ ప్రొపైల్ క్రియేట్ చేసింది. అందులో క‌న్న‌డ టీవీ సీరియ‌ల్స్ న‌టీమ‌ణుల ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. దీంతో పాటు ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో వాయిస్ చేంజ‌ర్ ఫోన్ కొనుగోలు చేసింది. ఈఫోన్‌లో వృద్ధులు, చిన్నపిల్లలు, అమ్మాయి, యువకులుగా వాయిస్ మార్చుకునే సౌకర్యం ఉంది. యువకులతో చాటింగ్ చేస్తు యువకులను మోసం చేసేది.

యువ‌కుల‌తో ప‌రిచ‌యం పెరిగిన త‌ర్వాత ఫోన్ చేసి ఒకసారి తల్లికి, మరోమారు తండ్రికి ఆరోగ్యం బాగోలేదని చికిత్సకు డబ్బులు కావాలని నమ్మించి అందినంత డబ్బులు లాగేది. తను ఉంటున్న హాస్టల్‌లో పనిచేసే వాచ్‌మెన్లు, వంటవారికి లోన్ ఇప్పిస్తానని వారి బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకునేది.

తల్లిదండ్రుల చికిత్స చేయించాలంటూ యువకులనుండి తీసుకున్న డబ్బులను వాచ్‌మెన్, వంట మనుషులకు సంబంధించిన ఖాతాలలో వేయమని సూచించేదని పోలీసులు తెలిపారు. దుర్గప్రసాద్ అనే వ్యక్తి నుండి లక్షన్నర వసూలు చేయడంతో పాటు… ఏదో ఒక కారణంతో తరచూ డబ్బులను అడగడంతో అనుమానం వచ్చి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కిలాడి లేడీని అరెస్టు చేశారు.

ఇంత‌కుముందు కూడా ఇదే త‌ర‌హా నేరాలు చేసి జైలుకు వెళ్లింది. డిసెంబర్‌లో జైలు నుండి విడుదలైన ఆరు నెలల్లో 8మంది యువకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. చివరికి మోసపోయిన వ్యక్తి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిలాడి లేడీని అరెస్టు చేశారు.

First Published:  12 Jun 2019 7:55 PM GMT
Next Story