ఇక పూర్తిస్థాయిగా…. నిర్మాణ రంగంలోకి… నమ్రత

ప్రస్తుతం ఉన్న స్టార్ వైఫ్ లలో మంచి ఎంటర్ ప్రెన్యూర్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య మరియు ఒకప్పటి నటి అయిన నమ్రతా శిరోద్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది.

నిజానికి మహేష్ బాబు కి సంబంధించిన ఫైనాన్షియల్ పనులు మరియు ఇన్వెస్ట్ మెంట్లు తదితర విషయాలన్నీ దగ్గరుండి చూసుకునేది నమ్రత నే. ఆఖరికి మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది నమ్రత.

గత కొంత కాలంగా మహేష్ బాబు కి సంబంధించిన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్లు అన్నీ ఇనాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ నమ్రత, మహేష్ కలిసి వాటిని మళ్ళీ యాక్టివ్ గా మార్చనున్నారు.

ఇప్పటికే అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమాను నిర్మించనున్నారు. ‘జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్’ స్వయంగా ఈ సినిమాను నిర్మించనుంది.

అంతేకాకుండా ఈ బ్యానర్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమాకి కూడా సహ నిర్మాణ సంస్థ గా వ్యవహరించనుంది. ఈ ప్రొడక్షన్ పనులన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో ముందుకు వెళ్ళడానికి హైదరాబాద్ లో ఒక పెద్ద ఆఫీస్ ను తీసుకొని నమ్రత ఈ పనులన్నీ చూసుకుంటోందని, రెగ్యులర్ గా మీటింగ్స్ కూడా పెడుతున్నారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే నమ్రత పూర్తిగా నిర్మాతగా మారబోతోందని సమాచారం.