బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో…. పూజా హెగ్డే మరో స్పెషల్….

మిగతా హీరోల సంగతి పక్కన పెడితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న ప్రతిసారీ హాట్ బ్యూటీ పూజ హెగ్డే తనలోని ఏదో ఒక కొత్త కోణాన్ని బయటకు తీసుకు వస్తూనే ఉంది.

ముందుగా ‘డిజే’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటపెట్టింది. అప్పటి నుంచి స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు మళ్లీ బన్నీ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది.

త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో కూడా పూజా హెగ్డే ఇప్పటివరకు ప్రేక్షకులు తెలియని ఒక కొత్త యాంగిల్ ను చూపించనుంది. తాజా సమాచారం ప్రకారం బన్నీ త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే ఒక పాట పాడనుందట.

ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో తనకు సంగీతం అంటే చాలా ఇష్టమని, ఖాళీ సమయాల్లో కూడా పాడుతూ ఉంటానని ఎప్పటికైనా సినిమాలో పడాలని కోరిక అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు అవే నిజం కాబోతున్నాయి. ఇప్పటికే చిత్ర సంగీత దర్శకుడు తమన్  సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే తన నటనతో కూడా మాత్రమే కాకుండా స్వరంతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుందన్న మాట.