రాజు గారి గది 3 కి…. సర్వం సిధ్దం

అక్కినేని నాగార్జున మరియు సమంత ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం రాజు గారి గది 2. ఓంకార్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం రాజు గారి గది అనే విజయవంతమైన సినిమా కి రెండో భాగం.

ఇప్పుడు ఈ సినిమా కి మూడో భాగం రానుంది. ఎప్పుడో ఈ సినిమా ని ప్రకటించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ సినిమా ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి సర్వం సిద్ధం చేశారు. ఎప్పటి లాగే ఓంకార్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తారు. అలాగే నిర్మాణం లో కూడా పాల్గొంటూ మరో నిర్మాణ సంస్థ ని భాగస్వామి గా చేసుకొనే అవకాశం ఉంది.

మొదటి భాగం కన్నా రెండో భాగం లో ఎక్కువ గ్లామర్ కి పెద్ద పీట వేస్తూ ఒక మంచి కథ ని చెప్పారు దర్శకులు. ఇప్పుడు మూడో భాగం కూడా అదే రేంజ్ లో చేయాలని ఆశిస్తున్నారు. ఈ సారి రాజు గారి గది లో కి తమన్నా ప్రవేశించనుంది.

ఈ సినిమా లో తమన్నా ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానుంది.